https://notcooltobully.com/

మోనిత లైవ్‌లో ఛాలెంజ్! మీరు తిట్టినా కొట్టినా డాక్టర్ బాబుని వదిలేదే లేదు..

news: ఆమె తెలుగు సీరియల్ హీరోయిన్‌గా.. కంటే కార్తీకదీపం విలన్‌గానే ఎక్కువ మందికి తెలుసు. మోనిత అనగానే.. ‘అమ్మా ఆమెనా.. కాపురాలు కూల్చేస్తుంది’ అంటూ బూతులు తిడతారు కార్తీకదీపం అభిమానులు. ఒక వ్యక్తిని ప్రేమించి అతడితో జీవితాన్ని కోరుకుంటూ.. అతడి ఇష్టంతో సంబంధం లేకుండా.. అతడు ప్రేమించి ప్రేయసిని చంపేసి, పెళ్లాడిన ఇళ్లాలుని దూరం చేసి.. ఎలాగైనా అతడినే పెళ్లాడాలని పట్టుపట్టిన క్యారెక్టర్ మోనితది. అందుకోసం ఎన్నో దుర్మార్గాలు చేసింది. ఇంకా ఇంకా చేస్తూనే ఉంది. మన వంటలక్క అన్ని కష్టాల పాలు కావడానికి ప్రదాన కారణం మోనితే. అందుకే చాలా మందికి ఆమంటే కోపం. లాక్ డౌన్ సందర్భంగా సీరియల్స్ అన్నీ నిలిచిపోవడంతో.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ‘స్టార్ మా’ సీరియల్ యాక్టర్స్‌ని లైవ్‌లోకి తెస్తోంది. అందులో భాగంగా శోభా శెట్టి అలియాస్ కార్తీకదీపం విలన్ మోనితని ఎఫ్‌బీలో లైవ్‌లోకి వచ్చింది. ఆమె ఏం చెప్పుకొచ్చారనే సంగతులతో పాటు సరికొత్త ఫోటోస్‌ మీ కోసం.